Akp: దక్షిణ కొరియాలో జులై 20 నుంచి 30వరకు జరిగే 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌కు నర్సీపట్నంకు చెందిన పెదిరెడ్ల చైత్యదీపిక ఎంపికైంది. గత నెల 15 నుంచి 30 వరకు పంజాబ్ మొహాలిలో జరిగిన భారత ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ జట్టు ఎంపిక పోటీలో దీపిక యూత్ కేటగిరి పెయిర్ స్కేటింగ్‌లో పాల్గొని ప్రతిభ చాటి భారత్ జట్టులో స్థానం సాధించింది.