PDL: పెద్దపల్లి మండలం కొత్తపల్లి 37వ నంబర్ రైల్వే గేట్ మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బుధవారం గేట్ ముందు టెంట్ వేసుకొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 39వ నంబర్ గేట్ మూసివేయడం వల్ల విద్యార్థులు పాఠశాలకు, రైతులు పొలాలకు సుమారు 3 కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే రైల్వే అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.