పాకిస్తాన్ మరో ఎత్తుగడకు దిగింది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ప్రకటించింది. దీంతో ఐఎస్ఐ చీఫ్‌గా కొనసాగుతూనే భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు స్వీకరించాడు. భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.