ప్రకాశం: కంభంలోని మండల పరిషత్ కార్యాలయంలో కిషోర బాలిక వికాసం మీటింగ్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సమ్మర్ క్యాంపు May 2నుండి జూన్ 10 వరకు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించుటకు మరియు బాల్యవివాహాలను నిరోధించేలా పిల్లలు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరభద్రచారి, ఎంఈఓ మాల్యాద్రి పాల్గొన్నారు.