ప్రకాశం: అద్దంకి పట్టణంలో బుధవారం కూకట్లపల్లికి చెందిన సూరిబాబు బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయలు నగదు డ్రా చేసి ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బండిలో ఉన్న మూడు లక్షల రూపాయలు కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.