KMM: మే 4న కైకొండాయిగూడెంలో CPI ML మాస్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెంచిన నిత్యవసర ధరలను తగ్గించాలన్నారు.