అనంతపురం: గాలివాన బీభత్సానికి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శెట్టూరు మండలంలోని బచ్చుపల్లిలో గొల్లల దొడ్డిలో గాలివాన బీభత్సంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల షెడ్డు మొత్తం గాల్లో ఎగిరింది. దీంతో ఆ గ్రామంలో ఏ నిమిషం ప్రమాదం ముంచుకోస్తుందని భయపడ్డారు. గాలి ఎక్కువ కావడంతో వర్షం నిలబడింది. దీంతో ఇలాంటి ప్రమాదం జరగకుండా ప్రజలు అప్రమత్తమయ్యారు.