SRD: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మే 7న ఉదయం 10 గంటలకు హైందవ వ్యక్తి కళా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి తెలిపారు. సంగారెడ్డిలోని శ్రీ రామ మందిరంలో దీనికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ ఈ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లికా వల్లభ, జై భారత్ రాష్ట్ర కార్యదర్శి రాజు పాల్గొన్నారు.