ATP: సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా రాయదుర్గం MLA కాలవ శ్రీనివాసులు 75 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. స్థానిక సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు గర్భిణీలకు చీర, జాకిట్, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఆడపడుచులకు సంపూర్ణ ఆరోగ్యన్ని ప్రసాదిస్తూ సుఖ ప్రసవం జరిగేలా ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.