ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు – దూబచర్ల R&B రహదారి గొల్లగూడెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోపీనాథపట్నం నుండి కొయ్యలగూడెం కర్రల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం ధ్వంసం కాగా ఢీకొన్న లారీ వెనుక భాగం నాలుగు చక్రాలు ఊడిపోవడంతో లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.