సత్యసాయి: మంత్రి సవిత గోరంట్ల మండలంలో పర్యటించారు. గౌనివారిపల్లి పంచాయతీ కమ్మల వాండ్లపల్లిలో గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆమె మొక్కులు తీర్చుకోగా, అర్చకులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.