SRD: ఖేడ్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని రైతుల కోసం 1000 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారన్నారు. అదేవిధంగా ఉల్లి పంట పండించే రైతుల కోసం గోదాంలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.