AP: తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన అందరికీ CM చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘మీ అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలు సాకారం చేసేందుకు నిరంతరం కష్టపడతా. రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల అభ్యున్నతికి పునరంకితమవుతా’ అని పేర్కొన్నారు.