TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.