AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హోమం నిర్వహించారు. అనంతరం ఆగమశాస్త్రం చదివి వేదపారాయణం చేసే 599 మంది పండితులకు రూ.53.91 లక్షలు పంపిణీ చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల నిరుద్యోగ భృతిని చెక్కుల రూపంలో అందించారు. హోమానికి వచ్చిన 8 వేల మందికి చీరలు, పంచెలు, తిరుమల లడ్డూ పంపిణీ చేశారు.