ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం రంగనాయక స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివ పార్వతులను సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పురాతన ఆలయ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు. మాజీ MLA పాల్వాయి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.