కృష్ణా: నిరంతర అనితర యోధుడు చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మనం నడవాలని ఏపీ ఎస్డబ్ల్యుసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణం టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి పార్టీ నేతలకు తినిపించారు.