కడప: నెల్లూరు జిల్లా పెంచలకోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేల్ రూపురాంపేటకు చెందిన ఝాన్సీ అనే యువతి మరణించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బద్వేల్‌కు చెందిన ఝాన్సీ, నరసింహ పెంచలకోన వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా, నరసింహను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.