ATP: పుట్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని MLA బండారు శ్రావణి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సదుపాయాలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం రోగులతో మాట్లాడి సౌకర్యాలు, వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విద్యుత్ సమస్య ఉందని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆమె వెంటనే పరిష్కారం చూపాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.