SRPT: గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు సంతలు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శనివారం నాగారం మండలం పస్తాల ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల సంత అంగడిని ప్రారంభించి మాట్లాడారు. కూరగాయల సంతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం గ్రామంలో సంతను ఏర్పాటు చేయించిన గ్రామ పెద్దలను ఆయన అభినందించారు.