NRML: నర్సాపూర్ జీ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీవో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రభుత్వం ద్వారా సూచించిన నియమ నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఇందులో డీటీ వాహెద్, వెటర్నరీ డాక్టర్ షేక్ ముక్తార్ కమిటీ సభ్యులు, ఎంపీడీవో పుష్పలత ఉన్నారు.