ELR: ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం మెరుగైన పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక లక్ష్యంతో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈ చెక్ థీమ్ చేపట్టామన్నారు. ఆఫీస్, ఇల్లు, దుకాణాల్లో వృధాగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను అధికారులకు అందజేయాలన్నారు.