ELR: ధాన్యం నూక శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు కేంద్రాల్లో పెసలు అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు అధిక ఎండలతో అన్నదాత నష్టపోతున్నారన్నారు.