కడప: ఒంటిమిట్ట మండల పరిధిలోని చింతరాజు పల్లె గ్రామపంచాయతీలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు 30 ఎకరాల అరటి, కలింగ పంటలకు నష్టం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట ఒక్కసారిగా నాశనం అయినదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల స్పందించి పంటను పరిశీలించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.