KMM: స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 31 వ వర్ధంతి సందర్భంగా.. బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్లో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. చంద్ర రాజేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు.