BDK: చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు పలు రకాల పంటలు నేలమట్టమయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు దెబ్బతినటంతో సదరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.