ASR: డుంబ్రిగూడ మండలంలో మిరియాల పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. ఇళ్ల ఆవరణలో టార్పాలిన్లపై ఎండబెడుతున్నారు. రెండు వారాలపాటు పంటను ఎండ బెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది మిరియాలు కేజీ రూ.600లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.