KRNL: కేంద్రం తీసుకొచ్చిన వక్స్ చట్టాన్ని కర్నూలులో మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, టౌన్ అధ్యక్షుడు పత్తా భాషా మాట్లాడారు. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిన తీరు బాధాకరమన్నారు.