AP: 2024-25 ఏడాదికి వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలో రెండో స్థానానికి చేరటంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. స్థిర ధరల్లో 8.21శాతం వృద్ధి రేటుతో రెండో స్థానానికి చేరిందని.. AP ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పలు రంగాల్లో పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. కాగా 9.69శాతం వృద్ధి రేటుతో తమిళనాడు తొలిస్థానంలో ఉంది.