W.G: పెంటపాడు మండలం కస్పా పెంటపాడు శ్రీ గోపాలస్వామి, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పటిక బెల్లం తులాభారం నిర్వహించారు.