VZM: ఎల్కోట మండలం ఖాసాపేటలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్‌తో కలసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.