శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లే భక్తులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది. రాజమండ్రి నుంచి భద్రాచలానికి 8 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు ఒక బస్సు చొప్పున నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.