నారాయణపేట: పంచాయతీ కార్మికులకు వేతనాలు అందటం లేదని శనివారం నారాయణపేట పట్టణంలో టీయుసీఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వున్న పంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.