పల్నాడు: రాజుపాలెం మండలం దేవరంపాడులో ప్రసిద్ద చెందిన శ్రీనేతి వెంకన్న స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. నెలరోజులు ప్రతి శనివారం జరిగే తిరునాళ్లలో భాగంగా మూడవ వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.