పల్నాడు: ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. వెల్దుర్తిలో శనివారం జరిగిన ప్రజాదర్బార్లో ఆయన పాల్గొని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మండల అధికారులు విధుల్లో అలసత్వం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలన్నారు.