కృష్ణా: చిత్తూరు ఎస్టీ గురుకుల పాఠశాల ఆవరణలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, స్పెషల్ ఆఫీసర్ శనివారం మొక్కలు నాటి నీళ్లు పోశారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి విద్యార్థి దశ నుంచి విరివిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం చీపురు పట్టి ఆవరణను శుభ్రం చేశారు. పచ్చదనం పరిశుభ్రత మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.