NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.