KRNL: ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జరిగింది. ఇందులో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణుసూర్య, డీఎల్పీవో నూర్జహాన్ పాల్గొన్నారు.