ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని ఒంగోలు హైవేపై సోమవారం ఎస్సై రవీంద్రారెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రూల్స్‌ను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.