NDL: నకిలీ పట్టాలు రద్దు చేసి, అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నందికోట్కూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఎంసీపీఐ(యూ) డివిజన్ సహాయ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించి, తహసీల్దార్ శ్రీనివాసులుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కన్వీనర్ లాజరెస్ మాట్లాడుతూ.. పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అందజేయాలని కోరారు.