సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లాలో స్వర్ణాంధ్ర-2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ-4 విధానం అమలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ టీ.ఎస్. చేతన్ ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.