ప్రకాశం: కొమరోలు ఎస్సైగా నాగరాజు సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు గుంటూరు జిల్లా నుండి బదిలీపై ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కొమరోలుకు వచ్చారు. ప్రస్తుతం కొమరోలు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు నాయక్ బదిలీపై ఒంగోలుకు వెళ్లారు.