W.G: ఆకివీడులో జరుగుతున్న P-4 సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామాల్లో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.