తన వివాహ రిసెప్షన్‌కు వచ్చే అతిథులకు BJP MP తేజస్వీ, గాయని శివశ్రీ జంట ఓ రిక్వెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగే విందుకు వచ్చే అతిథులు పువ్వులు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకురావొద్దని సూచించారు. వీటి వల్ల ఏం ఉపయోగం లేదని, దేశంలో వాటి వృథా విలువ రూ.315 కోట్లుగా ఉందని తెలిపారు. వివాహ విందుకు హాజరయ్యే దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.