NLG: ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయని తెలిపారు.