MNCL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని రంగంపేటలో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పీవోడబ్ల్యూ కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని స్థలాలలో భద్రత కల్పించాలని, మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.