KMM: జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్లకు 101 దరఖాస్తులు వచ్చాయని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయటం ద్వారా ఆదాయం పొందేల రైతులను కేంద్రం ప్రోత్సహిస్తుందని తెలిపారు.