KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఉన్నత కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 8న శనివారం వారాంతపు యార్డు బంద్, 9న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 10న సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు. మార్కెట్కు నాణ్యమైన సరుకులు తీసుకువచ్చి మంచి ధర పొందాలని సూచించారు.