SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. పనులు జరిగే చోట త్రాగునీరు, నీడ కొరకు టెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండలు ముదురుతున్న కొద్ది పనులు వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.