MNCL: లక్షెట్టిపేట మండలంలోని హనుమంతు పల్లె గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఇటీవలే దుబాయ్‌లోని హోమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడి మృతి చెందాడు. కాగా అతడి మృతదేహం బుధవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నట్లు గల్ఫ్ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న తెలిపారు. మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.